ధాన్యం కొనుగోళ్లపై నిరంతర పర్యవేక్షణ
వనపర్తి: జిల్లాలో నెలరోజులుగా కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిత్యం పర్యవేక్షిస్తున్నామని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎస్ శాంతకుమారి, మంత్రులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.వెంకటేశ్వర్లు, సంబంధితశాఖ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సన్న, దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వసతులు కల్పించామని.. తేమశాతం, నాణ్యతగా ఉన్న ధాన్యాన్ని తూకం చేసి మిల్లులకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్‌షీట్ల ఆధారంగా రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. చెల్లింపుల్లో సైతం జిల్లా ముందువరుసలో ఉందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు, కొన్న ధాన్యం, రైతులకు చేసిన చెల్లింపులు తదితర వివరాలను వివరించారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
Comments
Please login to add a commentAdd a comment