జిల్లా పోలీసు కార్యాలయంలో..
రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ రాందాస్ తేజావత్ పోలీసు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ పీఠికలోని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఈ సందర్భంగా వారితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం అందించడమే రాజ్యాంగ లక్ష్యమని వివరించారు. ప్రపంచంలోని అనేక దేశాలు స్వల్పకాలంలోనే రాజ్యాంగాలను మార్చుకుంటూ రద్దు చేసుకుంటున్నాయని.. ఎన్నో భాషలు, మతాలు, తెగలు, సంస్కృతులు, సాంప్రదాయాలున్న భారత్లో దశాబ్దాల నాటి రాజ్యాంగం నేటికీ అమలవుతున్నట్లు కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ ఐక్యతకు ప్రతీక అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment