ఆల్‌ ఇండియా పోటీలకు కేయూ జట్టు | - | Sakshi
Sakshi News home page

ఆల్‌ ఇండియా పోటీలకు కేయూ జట్టు

Published Tue, Nov 5 2024 1:01 AM | Last Updated on Tue, Nov 5 2024 1:01 AM

ఆల్‌

ఆల్‌ ఇండియా పోటీలకు కేయూ జట్టు

కేయూ క్యాంపస్‌: ఈనెల 6 నుంచి 9 వరకు అమృత్‌సర్‌లోని గురునానక్‌ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆల్‌ఇండియా జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ తైక్వాండో పురుషుల టోర్నమెంట్‌కు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు సోమవారం స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ వెంకయ్య తెలిపారు. ఈజట్టులో టి.నవీన్‌, ఎం.రాజేశ్‌ (హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల), టి.మోహన్‌కృష్ణ (వాగ్దేవి డిగ్రీ కాలేజీ, హనుమకొండ), కె.కిరణ్‌ (నలంద డిగ్రీ కాలేజీ, మహబూబాబాద్‌) కె.అఖిలేష్‌ (సమాఖ్య డిగ్రీ కాలేజీ, మహబూబాబాద్‌ ) ఉన్నట్లు వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు మహబూబాబాద్‌లోని నలంద డిగ్రీ కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ కె.రమేశ్‌ కోచ్‌ అండ్‌ మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు ఆయన తెలిపారు.

నేడు ఉమ్మడి జిల్లా

కళాకారుల సదస్సు

న్యూశాయంపేట: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నేడు (మంగళవారం) ఉమ్మడి వరంగల్‌ జిల్లా కళాకారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఫోరం బాధ్యులు జి.కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధి మడికొండ రాజశ్రీ గార్డెన్‌లో ఉదయం 9గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

వృత్తి విద్యతో ఉపాధి

విద్యారణ్యపురి: వృత్తి విద్య కోర్సులు చదువుతున్న వారు ఉపాధి అవకాశాలు పొందాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి (డీఐఈఓ) ఎ.గోపాల్‌ కోరారు. సోమవారం హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌ మేళాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయని, జాబ్‌ మేళాలు వినియోగించుకోవాలన్నారు. ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ ఆర్‌.ప్రవీణ్‌కుమార్‌, డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌, ట్రైనింగ్‌ ఆఫీసర్‌ కె.విజయకుమార్‌ తదితరులు పేర్కొన్నారు.

జాతీయస్థాయి వాలీబాల్‌

పోటీలకు ఎంపిక

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఉత్తరప్రదేశ్‌లో ఈనెల 6 నుంచి నిర్వహించే ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు హనుమకొండ డీఎస్‌ఏ క్రీడాకారుడు బర్ల సన్నీ ఎంపికైనట్లు కోచ్‌ బత్తిని జీవన్‌గౌడ్‌ తెలిపారు. హనుమకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సన్నీ ఇటీవల గోదావరిఖనిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వరంగల్‌ జిల్లా జట్టుకు ప్రాతినిఽథ్యం వహించి తృతీయ స్థానం సాధించడంలో ముఖ్య భూమిక పోషించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. జీవన్‌గౌడ్‌ వద్ద శిక్షణ పొందుతున్న సన్నీని హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ సోమవారం అభినందించారు.

ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు షురూ

కేయూ క్యాంపస్‌: కేయూలో ఆర్ట్స్‌, సైన్స్‌, సోష ల్‌ సైన్స్‌, కామర్స్‌, ఇంజనీరింగ్‌, లా విభాగా ల్లో పీహెచ్‌డీ పరిశోధకులకు సోమవారం ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వివిధ కేంద్రాల్లో పరీక్షల తీరు తెన్నులను కేయూ రిజిస్ట్రార్‌ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాఽధికారి నర్సింహాచారి పరిశీలించారు.

8న జాబ్‌మేళా

కాళోజీ సెంటర్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 8న ములుగు రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సీహెచ్‌.ఉమారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం తెలుసుకోవడానికి సెల్‌ నంబర్‌ 7093168464లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల యువతీయువకులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో ఉదయం 10.30గంటలకు హాజరుకావాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆల్‌ ఇండియా పోటీలకు కేయూ జట్టు1
1/2

ఆల్‌ ఇండియా పోటీలకు కేయూ జట్టు

ఆల్‌ ఇండియా పోటీలకు కేయూ జట్టు2
2/2

ఆల్‌ ఇండియా పోటీలకు కేయూ జట్టు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement