పెండింగ్ వినతులపై దృష్టి పెట్టాలి
● అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
● ప్రజావాణికి 73 వినతులు
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు పరిష్కరించడంతోపాటు పెండింగ్ వినతులపై దృష్టి సారించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అయన వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 73 అర్జీలు రాగా.. అందులో జీడబ్ల్యూఎంసీ, తహసీల్దార్ ఎల్కతుర్తి ఆరు చొప్పు న, డీపీఓ, తహసీల్దార్ ఐనవోలు, కమలాపూర్ నాలుగు చొప్పున, మిగతా ఇతర విభాగాలకు వచ్చాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వినతులు తిరస్కరణకు గురైతే కారణాలు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని చెప్పారు.
బతికుండగానే చంపేశారు..
వైఎస్సార్ ప్రభుత్వ నుంచి వితంతు పింఛన్ వస్తోంది. ఇటీవల స్థానిక అధికారులు నేను చనిపోయినట్లు నివేదిక ఇవ్వడంతో డీఆర్డీఏ అధికారులు పింఛన్ నిలిపివేశారు. ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ మూడుసార్లు కలెక్టర్‌ను నేరుగా కలిసి వినతిపత్రం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. నేను బతికే ఉన్నాను. భర్త లేడు. పింఛన్ కొనసాగించి ఆదుకోవాలి.
– ధర్మారం సమ్మక్క, ఎల్కతుర్తి
ఆలయ భూములను కాపాడాలి..
కాజీపేట మండలం శాయంపేటలోని శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయానికి సంబంధించిన(23ఏ సర్వే నంబర్‌లోని 5 ఎకరాల 10 గుంటలు) భూములను కొందరు ఆక్రమించారు. అందులో అక్రమంగా కట్టడాలు వెలుస్తున్నాయి.
– చీకటి రాజు, రాష్ట్రీయ హిందూ పరిషత్
రెండేళ్ల నుంచి పింఛన్ లేదు..
నాకు నాలుగేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైకల్యం ఏర్పడింది. ఇందుకు సంబంధించి డీఆర్డీఏ అధికారులు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. 2022లో వికలాంగుల పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటి వరకు మంజూరు చేయలేదు.
– పుట్ట శ్రీనివాస్, లక్ష్మీపురం(పరకాల)
Comments
Please login to add a commentAdd a comment