పునర్వినియోగం అలవాటు చేసుకోవాలి
● డీఈఓ వాసంతి
● వేస్ట్ టు వెల్త్ ప్రదర్శన పోటీలు
విద్యారణ్యపురి: వాడిన వస్తువులను పునర్వినియోగించుకోవడం అలవాటు చేసుకోవాల ని హనుమకొండ డీఈఓ వాసంతి విద్యార్థులకు సూచించారు. నిరుపయోగ వస్తువులు, సామగ్రి నుంచి ఉపయోగకర వస్తువులు, అలంకరణ సామగ్రిని తయారు చేయడంలో నైపుణ్యాలను ప్రొత్సహించేందుకు సోమవారం హనుమకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘వేస్ట్ టు వెల్త్’ ప్రదర్శనల పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 8, 9, 10వ తరగతి విద్యార్థులు వివిధ కళాకృతులను ప్రదర్శించి ప్రతిభ చాటా రు. డీఈఓ వాసంతి ఈ ప్రదర్శనను తిలకించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు అందించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్య ర్థాల నుంచి సృజనాత్మకత కళాకృతులు తయారు చేసేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. ఎన్‌జీసీ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పర్యావరణ, శక్తి వనరుల పొదుపు, కాలుష్య నియంత్రణ, వర్మీ కంపోస్ట్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన పోటీల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల ఎల్కతుర్తి విద్యార్థులు వైష్టవి, వలీమా ప్రథమ స్థానంలో నిలిచారు. భీమారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శ్రీజ, శివాని ద్వితీయ స్థానం, హనుమకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాయినితిన్, అనుప మ్, అన్సార్ స్కూల్ విద్యార్థులు అల్కమ్ షమీం, మహ్మద్ పర్హాన్ తృతీయ స్థానం సాధించారు. వీరికి నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్‌స్వామి గైడ్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్‌స్వామి, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం వాణి, ఉపాధ్యాయులు సుధాకర్‌రావు, శ్రీధర్, 54 పాఠశాలల నుంచి 108 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment