రోడ్డు పక్కన యువకుడి మృతదేహం
దుగ్గొండి: పొట్టకూటి కోసం దంపతులు వలస వచ్చారు.. కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు.. ఈ క్రమంలో అనా రోగ్యంతో కుమారుడు మృతి చెందాడు. మృతదేహాన్ని ఉంచడానికి యజమాని ఒప్పుకోలేదు. దీంతో మృతదేహాన్ని మూతపడిన ప్రభుత్వ హాస్టల్ భవనం ఎదుట ఉంచిన హృదయవిదారక సంఘటన నాచినపల్లిలో జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన లోడె వీరస్వామి–పద్మ దంపతులు నిరుపేదలు. ఎలాంటి ఆస్తిపాస్తులు, ఇల్లు లేకపోవడంతో పొట్టకూటి కోసం దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి 18 ఏళ్ల క్రితం వలస వచ్చారు. అప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు హరీశ్ (27) పదో తరగతి వరకు చదివి తల్లిదండ్రులతో భవన నిర్మాణ పనులకు వెళ్తున్నాడు. కొన్ని రోజుల క్రితం హరీశ్ అనారోగ్యానికి గురికావడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతదేహాన్ని అదేరోజు రాత్రి కుటుంబ సభ్యులు నాచినపల్లికి తీసుకురాగా.. అద్దె ఇంటి యజమాని ఒప్పుకోలేదు. దీంతో మృతదేహాన్ని స్థానికంగా ఉన్న మూతపడిన ఎస్సీ బాలుర వసతి గృహం ఎదుట నాచినపల్లి–పొనకల్ ప్రధాన రహదారి పక్కన ఉంచారు. ఈ సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
అద్దె ఇంటిలోకి రానివ్వని యజమాని
నాచినపల్లిలో హృదయవిదారక ఘటన
Comments
Please login to add a commentAdd a comment