రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి
వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని రోడ్డు భద్రతా మాసోత్సవాల కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల అవగాహన సదస్సులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రహదారులు, భవనాల శాఖ అధికారి నిర్దేశించిన మేర కు ఆయా శాఖల అధికారులు యాక్షన్ ప్లాన్ తయా రు చేసి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, 75 నుంచి 80 శాతం మరణాలు డ్రైవర్ల తప్పిదాల వల్ల సంభవిస్తాయని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాటిని నియంత్రిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. సమావేశంలో డీసీపీ రవీందర్, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ జైపాల్‌రెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్‌అండ్‌బీ ఈఈ జితేందర్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్య శారద
Comments
Please login to add a commentAdd a comment