కేయూ చెస్ జట్టు ఎంపిక
కేయూ క్యాంపస్: చైన్నెలోని వెల్‌టెక్ యూనివర్సిటీలో ఈనెల 8న ప్రారంభమై 11వ తేదీ వరకు జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ చెస్(మెన్) జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య గురువారం తెలిపారు. జట్టులో కె.అద్వైత్, టీవీఎన్ దివ్యాంశ, ఎస్.సంజయ్‌చంద్ర, బి.లోకేశ్, టి.అరుణ్‌కుమార్, ఎం. ప్రశాంత్ ఉన్నారు. వరంగల్ కిట్స్ ఫిజికల్ డైరెక్టర్ ఎస్.మహేశ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు.
నేటినుంచి యథావిధిగా
రైళ్ల రాకపోకలు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా శుక్రవారంనుంచి రైళ్ల రాకపోకలు యఽథావిధిగా సాగనున్నట్లు గురువారం స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–విజయవాడ సెక్షన్‌లో మోటమర్రి వద్ద మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో నెలరోజులనుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడిపించినట్లు పేర్కొన్నారు. రద్దయిన రైళ్లు, దారి మళ్లించిన రైళ్లు శుక్రవారం నుంచి యథావిధిగా కాజీపేట మీదుగా నడుస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
నేడు కమిషనర్ ఆఫ్
రైల్వే సేఫ్టీ పర్యటన
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధి కాజీపేట–బల్లార్షా సెక్షన్‌లో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ పర్యటించనున్నట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. బల్లార్షా–మణిఘర్ మధ్య నూతనంగా నిర్మించిన మూడో రైల్వే లైన్ నిర్మాణం, అదేవిధంగా వార్దా రైల్వే బ్రిడ్జిపై నిర్మించిన మూడో రైల్వే లైన్ నిర్మాణాన్ని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
దేవాదాయశాఖ నూతన
డీసీగా సంధ్యారాణి
హన్మకొండ కల్చరల్: సికింద్రాబాద్ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేఎన్ సంధ్యారాణి వరంగల్ దేవాదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌గా గురువారం అదనపు బాధ్యతలు చేపట్టారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన డీసీ సంధ్యారాణిని ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు ఆలయమర్యాదలతో స్వాగతించారు. ముందుగా ఆదిశంకరులను, వల్లభ గణపతిని దర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు జరుపుకున్నారు. ఈసందర్భంగా అర్చకులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. నూతన డీసీకి దేవాలయ చరిత్ర వివరించారు.
లా కళాశాల
బీఓఎస్‌గా సుదర్శన్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల బోర్డ్ ఆఫ్‌స్టడీస్ చైర్మన్‌గా ఆ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. సుదర్శన్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్‌గా ఉన్న డాక్టర్ పద్మజారాణి ఉద్యోగ విరమణ పొందడంతో ఆమె స్ధానంలో సుదర్శన్‌ను నియమించారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు.
11 నుంచి టెక్నికల్
సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు
కాళోజీ సెంటర్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు ఈనెల 11 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ పరీక్షలు 11వ తేదీన, హయ్యర్ పరీక్షలు 12,16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం, డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు 11, 12, 16,17 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం ఎంపిక చేసిన కేంద్రాల్లో జరుగుతాయని తెలిపారు. www.bse.telangana.gov.inలో విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment