మందుల కొరత లేకుండా చూడండి
ఎంజీఎం: ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. గురువారం ఆయన హనుమకొండ జిల్లా సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (సీఎంఎస్)ను సందర్శించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫార్మసిస్టులు మందుల కొరత లేకుండా జాగ్రత్త పడాలని, ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి అధికారులకు మందుల నిల్వను తెలియజేయాలన్నారు. మందుల వివరాలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో జిల్లా ఆరోగ్య కేంద్రాల్లోనూ మందుల కొరత లేకుండా సరఫరా చేయాలని సీఎంఎస్ ఫార్మసిస్టులు ఉప్పు భాస్కర్‌రావు, నళిని, సిబ్బందికి సూచించారు.
రేపు ఈ–ఔషధి వర్క్‌షాప్
కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈనెల 11న (శనివారం) జిల్లా పరిధి యూపీహెచ్‌సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి, టీబీ హాస్పిటల్‌తో పాటు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు చెందిన వైద్యాధికారులకు, ఫార్మసిస్టులకు, నర్సింగ్ ఆఫీసర్లకు ఈ–ఔషధిపై వర్క్‌షాప్ నిర్వహించన్నుట్లు డీఎంహెచ్ అప్పయ్య, సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫార్మసిస్టులు ఉప్పు భాస్కర్‌రావు, నళిని తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ వర్క్‌షాప్ ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు.
డీఎంహెచ్‌ఓ అప్పయ్య
Comments
Please login to add a commentAdd a comment