అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్కతుర్తి జంక్షన్‌లో రోడ్డుకు ఇరువైపులా లెవెలింగ్, వంగరలోని పీజీ విజ్ఞాన కేంద్రంలోని పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ పనులన్నీ ప్రారంభమయ్యాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ పనులు, పాఠశాలల ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌బాబు, టీజీఈడబ్ల్యూఐడీసీ డీఈ రవీందర్, ‘కుడా’ ఈఈ భీంరావు, తహసీల్దార్లు ప్రవీణ్‌కుమార్, జగత్‌సింగ్, ఎంపీడీఓ విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
డ్రైవింగ్‌లో నైపుణ్యం కోసమే శిక్షణ
హన్మకొండ: డ్రైవింగ్‌లో నైపుణ్యం కోసం నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసిన నిరుద్యోగులు వరంగల్ పైడిపల్లిలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో డ్రైవింగ్ శిక్షణ పొందారు. గురువారం ట్రైనింగ్ కాలేజీలో జరిగిన ముగింపు కార్యక్రమంలో శిక్షణ పొందిన నిరుద్యోగులకు సర్టిఫికెట్లను కలెక్టర్ ప్రావీణ్య ప్రదానం చేశారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ జీఎం ఆనంద్, ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్, ఆర్టీసీ ట్రైనింగ్ డైరెక్టర్ సుధా పరిమళ, డిప్యూటీ ఆర్‌ఎం కేశరాజు భానుకిరణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఆర్టీసీ ట్రైనింగ్ ప్రిన్సిపాల్ అర్పిత, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
Comments
Please login to add a commentAdd a comment