తుది దశకు సర్వే
సాక్షి, వరంగల్: పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగంగా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తుదారులు ఉండకపోవడం, ఇంకొందరు ఉద్యోగం చేస్తున్న నగరాల నుంచి స్వగ్రామాలకు వెళ్లడం, కొన్ని సందర్భాల్లో గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో కొంతమంది వార్డు అధికారులు, ఇతర సిబ్బంది గైర్హాజరు కావడం, యాప్‌లో సాంకేతిక సమస్యల వంటి కారణాలతో సర్వే ఆలస్యమైంది. వారం రోజులుగా సర్వే వేగం పుంజుకుంది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 90 శాతానికిపైగా సర్వే పూర్తి చేశారు. సంక్రాంతిలోపు మొత్తం ముగుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, హనుమకొండలో దరఖాస్తుదారులు సమయానికి అందుబాటులో లేకపోవడంతో కాస్త ఆలస్యమైంది. తమ ఇంటికి అధికారులు సర్వేకు రావడం లేదని, దరఖాస్తులు లేవని అధికారులు సమాధానం చెబుతున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
42 వేల మందికే..
ఉమ్మడి జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి, నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలున్నాయి. ఈ 12 నియోజకవర్గాలకు 42,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించనున్నారు. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో విడతలో స్థలం లేనివారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇళ్లను మంజూరు చేయనుంది. ప్రజాపాలనలో మహిళల పేరుతో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వారి పేరు మీదనే ఇళ్లు ఎంపిక చేసేలా అధికారులు కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. గతంలో మాదిరిగానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణం, నిధుల విడుదలలో అక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారానే సమగ్ర వివరాలు పొందుపరిచే ప్రక్రియ పూర్తి కావొచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది లక్షలకు పైగా దరఖాస్తులు వస్తే తొలుత భూమి ఉండి ఇళ్లు లేని వారికి ఇవ్వనున్నారు. వీరు దాదాపు నాలుగు లక్షలకుపైనే ఉండడంతో తొలి విడత 42,000 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇదిలా ఉండగా సంక్రాంతి లోపు సర్వే పూర్తి కానుండడంతో యాప్‌లో వివరాలు వాస్తవంగా నమోదు చేశారా, అవకతవకలకు పాల్పడ్డారా అని తెలుసుకునేందుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ చేసేందుకు గ్రామాల్లో ఎంపీడీఓలు,మున్సిపాలిటీల్లో కమిషనర్ల లాగిన్‌లకు పంపుతోంది. వీరు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్‌లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పరిశీలిస్తారు. ఏమైనా తప్పని తేలితే బాధ్యుడైన సర్వేయర్‌పై చర్యలు తీసుకునే అవకాశముంది. ఆ తర్వాత గ్రా మసభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేయనున్నారు.
ఐలోని మల్లన్న ఆలయ ఉత్సవ కమిటీ
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి 14 మంది సభ్యులతో నాలుగు రోజుల కాల వ్యవధికి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ.. ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రెనోవేషన్, పర్మనెంట్ కమిటీకి మాత్రమే అవకాశం ఉండగా.. గతేడాది జనవరి 12న ప్రభుత్వం జీఓ నంబర్ 4 ద్వారా తెలంగాణ ఎండోమెంట్ యాక్ట్‌కు సవరణ తీసుకొచ్చింది. ఉత్సవ కమిటీని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ఫెస్టివల్ కమిటీ ఏర్పాటైన తొలి ఆలయంగా ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మరోసారి జీఓ నంబర్ 4 ద్వారా ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో జరుగనున్న సంక్రాంతి జాతరను పురస్కరించుకుని ఈనెల 12 నుంచి 15 వరకు 4 రోజుల కాలవ్యవధికి 14 మంది సభ్యులతో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు.
కమిటీ సభ్యులు వీరే..
కమిటీ సభ్యుల్లో కమ్మగోని ప్రభాకర్‌గౌడ్ (కొత్తపల్లి), మనాల సుదర్శన్‌రెడ్డి(కొండపర్తి), బందెల వెంకన్న (దౌలత్ నగర్), ధరం పూర్ణచందర్ (పర్వతగిరి), బండ సరిత(ల్యాబర్తి), గుంటి కుమారస్వామి (ఇల్లంద), కొండేటి మమత(వర్ధన్నపేట), నూనావత్ కీమానాయక్ (బీకే తండా), కూస చిరంజీవి (పెరుమాండ్ల గూడెం), పెండ్లి సంపత్ (ఒంటిమామిడిపల్లి), దోమకొండ హరీశ్(నందనం), నూతనగంటి రాజు (దమ్మన్నపేట), పల్లకొండ రమేశ్(ఐనవోలు), సిరిమల్ల మధుసూదన్(రంగారెడ్డి జిల్లా) ఉన్నారు.
రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ●
● ఇద్దరు జాతీయస్థాయికి ఎంపిక
విద్యారణ్యపురి: మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్, ఇన్‌స్పైర్ మనక్ ఎగ్జిబిట్ల ప్రదర్శనలో హనుమకొండ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఇన్‌స్పైర్ విభాగంలో ఏకశిల హైస్కూల్ పున్నేల్‌కు చెందిన గైడ్ ఉపాధ్యాయుడు రమేశ్ మార్గదర్శకత్వంలో కె.జెస్సీ 8వ తరగతి విద్యార్థి ప్రాజెక్టు ‘ఎ గ్లోవ్స్ ఫర్ ఉమెన్ సేఫ్టీ’ ఎంపికై ంది. సైన్స్‌ఫెయిర్‌లో హసన్‌పర్తిలోని పెంబర్తి ఏకశిల టెక్నోస్కూల్ గైడ్ ఉపాధ్యాయిని మాధవి సహకారంతో 9వ తరగతి విద్యార్థి ఎం.మన్వితరెడ్డి ‘నేచురల్ ఫార్మింగ్ సబ్ థీమ్’లో రూపొందించిన ‘మోర్ మాయిశ్చర్‌విత్ లెస్‌వాటర్’ అనే ఎగ్జిబిట్ ఎంపికై ంది. ‘మిల్లెట్స్ ఫర్ సస్టేయినబుల్ ఫ్యూచర్’ శీర్షికపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో హనుమకొండలోని రోజరీ హైస్కూల్ విద్యార్థి బి.విష్ణువేద్ ద్వితీయస్థానం పొందారు. వీరికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందించారు. ఆయా విద్యార్థులను డీఈఓ వాసంతి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి అభినందించారు.
త్వరలో ఉమ్మడి జిల్లాలో పూర్తికానున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే
సంక్రాంతి తర్వాత
దరఖాస్తుల పరిశీలన
అనంతరం గ్రామసభల్లో
అర్హుల ఎంపిక ప్రక్రియ
తొలి విడతలో భూమి ఉండి
ఇళ్లు లేని వారికే అవకాశం
ఉమ్మడి జిల్లాలో సర్వే వివరాలు..
జిల్లా వచ్చిన సర్వే శాతం
దరఖాస్తులు పూర్తయినవి
ములుగు 90,863 87,315 96
వరంగల్ 2,33,636 2,21,316 95.01
జనగామ 1,43,187 1,34,696 94
భూపాలపల్లి 1,23,469 1,16,217 94
మహబూబాబాద్ 2,17,591 1,95,500 90
హనుమకొండ 1,96,703 1,82,228 92.64
10,05,449 9,37,272
Comments
Please login to add a commentAdd a comment