బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఎల్కతుర్తి: కొత్తకొండ వీరభద్రస్వామి కల్యాణం, జాతరకు సర్వం సిద్ధమైంది. ఈనెల 10న (శుక్రవారం) నాడు ధ్వజారోహణం గణపతి పూజ, శైవశుద్ధి పుణ్యహవచనం, పంచగవ్వ పాశన, అంకురార్పణ, అఖండ దీపారాధన, దీక్షాధారణ, బేరిపూజ, ద్వాత్రింశంత్ అలాపన, ధ్వజారోహణం, తీర్థ ప్రసాద వితరణ జరుపనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. సాయంత్రం 6:40కి (గోధూళి ముహూర్తం) స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుపనున్నట్లు ఆలయ ఈఓ కిషన్‌రావు తెలిపారు. 11న త్రిశూలార్చన, నవకలశార్చన. 12న లక్ష బిల్వార్చన, 13న బోగి పండుగ, 14న సంక్రాంతి బండ్లు తిరుగుట, 15న కనుమ ఉత్సవం, 16న నాగవెల్లి పుష్పయాగం, 17న త్రిశూల స్నానం, 18న అగ్ని గుండాలతో జాతర వేడుకలు ముగియనున్నట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి కిషన్‌రావు తెలిపారు.
అధికారుల సమీక్ష
జాతర ఏర్పాట్లపై గురువారం కొత్తకొండలోని కల్యాణ మండపంలో నిర్వహించిన పలు శాఖల అధికారుల సమీక్షలో ఆర్డీఓ రమేశ్‌రాథోడ్, కాజీపేట ఏసీపీ తిరుమల్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య హాజరయ్యారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. తాగునీటి సౌకర్యం, విద్యుత్, పోలీస్ బందోబస్తు నిర్వహణ, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పాటించాల్సిన సూచనలపై అవగాహన కల్పించారు. జాతరకు వ చ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.లోటుపాట్లు లేకుండా జాతరను విజయవంతం చేయాలని సూచించా రు. సమావేశంలో ఆలయ ఈఓ కిషన్‌రావు, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్,సీఐ పులి రమేశ్,ఎస్సై సా యిబాబు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
దేవస్థానం చైర్మన్‌గా చంద్రశేఖర్‌గుప్తా
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ చైర్మన్‌గా కొత్తపల్లి గ్రామానికి చెందిన కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా నియమితులయ్యారు. నియామక ఉత్తర్వులను ఆలయ ఈఓ కిషన్‌రావు గురువారం చంద్రశేఖర్‌కు అందజేశారు. ఈసందర్భంగా చంద్రశేఖర్‌గుప్తా మాట్లాడుతూ.. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన నియామకానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నియామకంపై పాలకవర్గ సభ్యులు, పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
నేడు స్వామివారి కల్యాణం
ప్రారంభం కానున్న కొత్తకొండ జాతర
Comments
Please login to add a commentAdd a comment