తెరపైకి కొత్త నినాదం
ఉప్పల్ అయితేనే సౌకర్యవంతం
ఉప్పల్‌ను మండలంగా చేస్తే చుట్టు పక్కల ఉన్న తొమ్మిది, పది గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పటికే ఉప్పల్‌లో రైల్వే స్టేషన్‌తో పాటు పీహెచ్‌సీ, రెండు ప్రభుత్వ పాఠశాలలు, పశు వైద్యశాల వంటివి ఉన్నాయి. మండలంగా ఏర్పడితే మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలతో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
– ర్యాకం సవేందర్, గ్రామస్తుడు
అనుకూల ప్రాంతం..
ప్రత్యేక మండలం చేయడానికి ఉప్పల్ చాలా అనుకూలం. ఉప్పల్ చుట్టూ తొమ్మిది నుంచి పది గ్రామాలున్నా యి. వారికి ఏ అవసరము న్నా నిత్యం ఉప్పల్‌కే వచ్చి పోతుంటారు. అన్ని వసతులున్న ఉప్పల్‌ను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.
– దేవులపల్లి వాణీరావు, మాజీ సర్పంచ్
అన్ని అర్హతలున్నాయి..
కమలాపూర్ తర్వాత మండలంలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ ఉప్పల్ ఒక్కటే. ఇక్కడ ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే రైల్వేస్టేషన్ ఉంది. ముఖ్యంగా ఈ చుట్టు పక్కల గ్రామాలకు ఉప్పల్ పెద్ద దిక్కుగా ఉంటోంది. మండలంగా ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉప్పల్‌కు ఉన్నాయి.
– మారపెల్లి నవీన్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ
ఉప్పల్ గ్రామ
పంచాయతీ
కార్యాలయం
కమలాపూర్: గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనతో పాటు కొన్ని చోట్ల కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో అప్పట్లో కొన్ని ప్రాంతాల్లో కొత్త మండలాల ఏర్పాటుకు ప్రజలు, రాజకీయ నాయకులు అనుకూలమైన ప్రాంతాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం కొన్నింటిని మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. జిల్లాల పునర్విభజన సమయంలో కమలాపూర్ మండలంలోని ఉప్పల్, శనిగరం గ్రామాలను ప్రత్యేక మండలాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. కానీ.. అప్పట్లో కేసీఆర్ అందుకు విముఖత చూపడంతో చేసేదేం లేక ప్రజలు, నాయకులు మిన్నకుండిపోయారు. దీంతో కొత్త మండలాల నినాదం కాస్తా తెరమరుగైంది.
తారుమారు..
అసెంబ్లీ ఎన్నికల్లో పాడి కౌశిక్‌రెడ్డి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని ఉప్పల్, శనిగరం, జమ్మికుంట మండలంలోని వావిలాల, వీణవంక మండలంలోని చల్లూరును కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం హుజూరాబాద్ నుంచి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ పరిస్థితి తారుమారై రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్‌రెడ్డి నియోజకవర్గంలో కొత్త మండలాలను ఏర్పాటు చేయలేకపోయారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాలోని మల్లంపల్లిని కొత్త మండలంగా ప్రకటించడంతో మళ్లీ కొత్త మండలాల నినాదం తెరమీదికి వచ్చింది. ఈక్రమంలో ఉప్పల్‌ను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఈనెల 7న జరిగిన గ్రామసభలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఉప్పల్ మండల సాధన కోసం పార్టీలకతీతంగా జేఏసీగా ఏర్పడి ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
ఉప్పల్‌ను మండలం చేయాలని గ్రామసభ తీర్మానం
ఉద్యమ కార్యాచరణ
రూపొందిస్తున్న నాయకులు
Comments
Please login to add a commentAdd a comment