నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు

Published Wed, Jan 22 2025 1:18 AM | Last Updated on Wed, Jan 22 2025 1:18 AM

నైపుణ

నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు

కలెక్టర్‌ సత్యశారద

వరంగల్‌: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా కేంద్రంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘వీ హబ్‌’కు చెందిన అధికారులతో జిల్లాలోని మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుటకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించి దిశా ని ర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ఔత్సాహిక మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో ‘వీ హబ్‌’ సహకారంతో(స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌) నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మహిళల సభ్యులకు పరిశ్రమలు, వ్యాపారాలు, ఎంటర్పెన్యూర్‌గా ఎదిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. మహిళలకు పిలిగిరి ఆర్ట్‌, లేస్ల తయారీ, గుర్రపు డెక్కల ద్వారా వస్త్రాల తయారీ, జొన్నల ద్వారా టీ కప్పుల తయారీ తదితరపై శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీపీఓ కల్పన, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, ‘వీ హబ్‌’ సంచాలకులు జాహిద్‌ అక్తర్‌షేక్‌, సహాయ సంచాలకులు ఊహ, డీపీఎం రేణుక, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకలు

ఘనంగా నిర్వహించాలి

వరంగల్‌: గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీసీపీ రవీందర్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో మంగళవారం వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల వారీగా అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు వేదిక, సీటింగ్‌ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింభించేలా స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానా లు పంపాలని సూచించారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని, అగ్నిమాపక యంత్రాన్ని వేడుక స్థలం వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. వరంగల్‌ ఆర్డీఓ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా ప్రశంసా పత్రాలు సిద్ధం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ.. వేడుకలు విజయవంతమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్‌ రెడ్డి, ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు

ఆర్‌డీఎఫ్‌ విద్యార్థులు

పర్వతగిరి: రంగారెడ్డి జిల్లా కొల్లూరులో సోమవారం 44వ ఎన్‌టీపీసీ జూనియర్‌ విలువద్య రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని కల్లెడ ఆర్‌డీఎఫ్‌ విద్యార్థులు నలుగురు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. రికర్వ్‌ బాలుర విభాగంలో బల్లె గంగరాజు ఒకటో స్థానం, బాలికల విభాగంలో ముంజాల స్ఫూర్తి మూడో స్థానం, సామల నాగేశ్వరి రెండో స్థానంలో నిలిచారు. ఇండియన్‌ రౌండ్‌ బాలుర విభాగంలో బాల్లే వినయ్‌ నాల్గో స్థానంలో విజయం సాధించారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కోల్‌కతాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని ఆర్‌డీఎఫ్‌ వనిత అచుత పాయి కళాశాల ప్రిన్సిపాల్‌ ఆడెపు జనార్ధన్‌, మంగళవారం తెలిపారు. కోచ్‌ రేణ మండల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎ.రాజు, అధ్యాపకులు తదితరులు విద్యార్థులను అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నైపుణ్య అభివృద్ధి కేంద్రం  ఏర్పాటుకు చర్యలు1
1/1

నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement