బుధవారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2025
ఎంపీడీఓపై మల్లక్‌పేట గ్రామస్తుల ఆగ్రహం
పరకాల ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులుపై మల్లక్‌పేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు చేర్చాలని గృహలక్ష్మి లబ్ధిదారులు దరఖాస్తులు అందించే ప్రయత్నం చేయగా ఎంపీడీఓ నిరాకరించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకు తీసుకోరంటూ తమ వెంటతెచ్చుకున్న దరఖాస్తులను అక్కడే విసిరేసి గొడవపడ్డారు. ప్రజాపాలన జాబితాలో పేర్లు ఉన్న తర్వాత మళ్లీ కొత్తగా తీసుకోవడంతో ఇబ్బంది ఉంటుందని ఎంపీడీఓ గృహలక్ష్మి లబ్ధిదారులతో చెప్పడంతో గొడవకు దారితీసింది. కాగా, కాంగ్రెస్ నాయకులను వేదికపై కూర్చోబెట్టారని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment