2025–26 కేంద్ర బడ్జెట్ ఊరించి.. ఉసూరుమనిపించింది. కేంద
ఓరుగల్లుకు దక్కని నిధులు..
రెండో రాజధానిగా అబివృద్ధి చేస్తామని ఓరుగల్లును ప్రచారం చేస్తున్నా ఈ బడ్జెట్‌లో నిధుల వాటా దక్కలేదు. ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్‌పోర్టు తదితర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని చేసిన రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు. ఈ ప్రతిష్టాత్మక పథకాలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరగకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ను నేరుగా పద్దుల్లో చేర్చకపోవడం వల్ల ఈ ఏడాది అది పూర్తవుతుందనే నమ్మకమే లేకుండా పోయింది. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు రూ.350 కోట్లు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలే అయ్యాయి. లెదర్‌పార్కు, సైనిక్‌స్కూల్‌తో పాటుతోపాటు వివిధ పథకాల కోసం చేసిన ప్రతిపాదనలను పట్టించుకోకపోగా.. రూ.4,174 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ మాటెత్తలేదు.
Comments
Please login to add a commentAdd a comment