మడికొండ: గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశానికి ఈనెల 23న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మడికొండ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి సమావేశంలో పేర్కొన్నారు. బుధవారం మడికొండ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 6వ తేదీలోపు ఆదాయం, బర్త్ సర్టిఫికెట్, ఫొటోతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఈఓ గురుకుల పాఠశాల, కళాశాలకు 5వ తరగతిలో 80 సీట్ల చొప్పున కేటాయిస్తారని పేర్కొన్నారు. మడికొండ బాలికలు, వర్ధన్నపేట (మడికొండ) బాలురు, పరకాల బాలుర గురుకులం, ఎల్కతుర్తి, పరకాల, హసన్‌పర్తి, వరంగల్ పశ్చిమ, ధర్మసాగర్, ఆత్మకూరు, భూపాలపల్లి పాఠశాలల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment