జాతీయస్థాయి పోటీలకు దేవా ఎంపిక
నెక్కొండ: రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని బొల్లికొండ తండాకు చెందిన నూనావత్ దేవా బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ గత నెల 28న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్వహించిన తెలంగాణ 7వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపాడు. జావెలిన్ త్రో, డిస్కస్ త్రో పోటీల్లో రెండు బంగారు పతకాలు, లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించినట్లు పేర్కొన్నాడు. ఈ నెల 17 నుంచి 20 వరకు చైన్నైలో జరగనున్న 23వ జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ క్రీడా పోటీలకు ఎంపికై ననట్లు తెలిపాడు. ఈ సందర్భంగా తెలంగాణ పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇస్లావత్ శేఖర్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ తదితరులు దేవాను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment