వరంగల్
ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
కేంద్ర బడ్జెట్‌లో ఓరుగల్లుకు మొండిచెయ్యి
బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు
హనుమకొండలోని ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీ గ్రౌండ్‌లో నేడు (ఆదివారం)మధ్యాహ్నం 2 గంటలకు బీసీ రాజకీయ యుద్ధభేరి బహిరంగ సభ జరగనుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ‘కుడా’ మాజీ చైర్మన్, టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సుందర్‌రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేశారు. పలువురు బీసీ సంఘాల జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు.
వైద్య ఆరోగ్య రాయితీలు..
పర్యాటక ప్రాంతాలకు నిధులు..
దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, 200 జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుతో పాటు 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించి వైద్యం, ఆరోగ్య పరంగా పేదలకు రాయితీలు ఇచ్చారు. క్యాన్సర్ పేషెంట్లకు సరఫరా చేసే మందుల ధరలు తగ్గనుండగా.. ఉమ్మడి వరంగల్‌లో 23,190 మందికి నెలనెలా ఖర్చులు తగ్గనున్నాయి. పర్యాటక ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రామప్ప, లక్నవరం, పాకాల, వరంగల్ పర్యాటక ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
● ట్రైబల్ యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు..
కీలక ప్రాజెక్టుల ప్రస్తావనే రాలేదు
● రైతులు, మధ్య తరగతి జీవులకు పథకాలు..
గిగ్ వర్కర్లకు భరోసా
● క్యాన్సర్ మందులు,
ఎలక్ట్రానిక్ వస్తువులు చౌక
● ధూమపాన ప్రియులకు షాక్..
వేతన జీవులకు భారీ ఊరట
● మొత్తంగా నిర్మలమ్మ బడ్జెట్‌పై పెదవి విరుపు
రైతులు, మధ్యతరగతి ప్రజలకు ఓదార్పు..
రైతులు, మధ్యతరగతి ప్రజలకు కొత్తపథకాలను ప్రకటించి ఆ వర్గాలకు ఓదార్పునిచ్చింది. వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత పేరిట రైతుల ఆదాయాన్ని పెంచడానికి వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునూతన పద్ధతులను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా గతేడాది పలు కార్యక్రమాలు చేపట్టారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం అమలు చేస్తున్నారు. ఈసారి రైతుల నుంచి నేరుగా కంది, మినుములు, మసూర్‌లను కేంద్రం కొనుగోలు చేయనుంది. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం మూలాన ఉమ్మడి జిల్లాలో 8.21 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.
గిగ్ వర్కర్లు, వీధివ్యాపారుల సంక్షేమం కోసం ఈ సారి బడ్జెట్‌లో ప్రత్యేక చోటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆరోగ్య సంరక్షణ, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందేందుకు వీలుగా కొత్తగా సంక్షేమ పథకం ప్రతిపాదించింది. ఇందుకోసం గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. పట్టణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో పనిచేసే గిగ్ కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్ ద్వారా ఈ ఐడీ కార్డుల కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్‌లో 7.19 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు కూడా అందించనున్నారు.
పింక్ బుక్ వస్తేనే రైల్వే బడ్జెట్ తేలేది
సాధారణ బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లా నిధులు వాటా ఇలా ఉంటే.. పింక్ బుక్ విడుదలయితేనే రైల్వేశాఖకు కేటాయింపులు తేలనున్నాయి. మణుగూరు – రామగుండం రైల్వేలైన్ సర్వే కోసం బడ్జెట్ కేటాయించిన కేంద్రంలో భూసేకరణ, నిర్మాణం కోసం నిధులు ఇచ్చారా? లేదా?.. మంజూరైన హసన్‌పర్తి – కరీంనగర్, డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వేలైన్ల సర్వే, భూసేకరణ, నిర్మాణం కోసం చేసిన కేటాయింపులు ఎంత? అన్న లెక్కలు తేలనున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే కోచ్‌ఫ్యాక్టరీకి ఏ మేరకు నిధులిచ్చారు? కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్, రైల్వే ఆస్పత్రిని సఖ్ డివిజన్ ఆసుపత్రి మార్పుపైన ఇంకా ఆశలు ఉన్నాయి. స్టేషన్ ఘన్‌ఫూర్ నుంచి సూర్యాపేట వరకు కొత్త లైన్, కాజీపేట జంక్షన్ నుంచి ముంబై, విజయవాడ, కాగజ్‌నగర్ వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభంతోపాటు ఉమ్మడి వరంగల్‌లో పలు అంశాలకు పింక్‌బుక్‌లో ఊరట లభిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వికసిత్ భారతా? వికసిత్ బిహారా?
కేంద్రబడ్జెట్‌లో ఈసారి వరంగల్‌కు మొండిచెయ్యే. తెలంగాణకు స్పెసిపిక్‌గా బడ్జెట్‌లో ఇచ్చిందేమీ కనిపించలేదు. ప్రతీ పథకానికి ఓ అందమైన పేరు పెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేశారే గానీ తెలంగాణకు, అందులో ఉమ్మడి వరంగల్ ఏమి ఇవ్వలేదు. మొత్తంగా బడ్జెట్ కేటాయింపులు చూస్తే కేంద్రం వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తుందా, లేక వికసిత్ బిహార్ లక్ష్యంగా పని చేస్తుందా అనిపిస్తోంది.
– కడియం కావ్య, ఎంపీ, వరంగల్
వేతన జీవులకు భారీ ఊరట..
ఈసారి బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్నునుంచి మినహాయింపు కల్పించారు. రూ.12 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నులు చెల్లించే 24,950 ఉద్యోగులు, సుమారు 35 వేల మంది వ్యాపార, వాణిజ్య, ఇతర వర్గాలకు చెందిన వారికి ఊరట కలుగనుంది.
– IIలోu
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment