రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు మొండ్రాయి విద్యార్థి
సంగెం: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు మొండ్రాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు కె.విజయ, పీడీ ముఖర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. గత డిసెంబర్‌లో ఓసిటీలో జరిగిన ఉమ్మడి జిల్లా సీనియర్ సాఫ్ట్‌బాల్ సెలక్షన్ పోటీల్లో 8వ తరగతి విద్యార్థినులు బి.లక్ష్మీప్రసన్న, జి.చిన్ను ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈనెల 2 నుంచి 3 వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరుగనున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో లక్ష్మీప్రసన్న, చిన్ను పాల్గొంటున్నట్లు తెలిపారు. విద్యార్థినులను ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ శ్రీలత, హెచ్‌ఎం విజయ, పీడీ ముఖర్జీ, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment