శాంతియుతంగా గ్రామసభలు నిర్వహించాలి
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
దామెర: సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మండలంలోని ఊరుగొండలో మంగళవారం నిర్వహించిన గ్రామసభను సీపీ పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి రామ్మూర్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభలకు వచ్చే ప్రజలకు కల్పించిన సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల కోసం గ్రామ సభలు ఏర్పాటుచేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గ్రామ సభల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, సామరస్యంగా గ్రామ సభల నిర్వహణకు ప్రజలు సహకరించాలని సీపీ కోరారు. ఆయన వెంట ప్రొబేషనరీ ఎస్సై విష్ణు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment