నడికూడ: ఎంపీడీఓ శ్రీనివాస్ విధులకు లాంగ్ లీవ్ పెట్టారు. ఇప్పటికే సెలవులో ఉన్న ఆయనను మరికొంతకాలంపాటు సెలవుల్లోనే ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామసభలో చర్చించే జాబితా, ఇతరత్రా అధికారిక కార్యక్రమాల సమాచారాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్.. ఆయా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ, స్థానిక అధికార పార్టీ నాయకులకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన ఎంపీడీఓ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు తెలిపినట్లు సమాచారం. దీంతో కలెక్టర్.. సదరు ఎంపీడీఓ శ్రీనివాస్‌ను లాంగ్‌లీవ్‌లో వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా, శ్రీనివాస్ స్థానంలో ఎంపీఓ చేతన్ కుమార్‌రెడ్డికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా
ఎంపీఓ చేతన్‌కుమార్
శ్రీనివాస్ పనితీరుపై
ఎమ్మెల్యే రేవూరి అసంతృప్తి..
కలెక్టర్ ఆదేశాలతో
సెలవులో వెళ్లిన ఎంపీడీఓ?
Comments
Please login to add a commentAdd a comment