నిరసనలు.. వాగ్వాదాలు
శాయంపేట : జాబితాలో పేర్లు లేవని తహరాపూర్‌లో అధికారులను నిలదీస్తున్న ప్రజలు
పరకాల: నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం పలు గ్రామాల్లో మంగళవారం చేపట్టిన గ్రామ సభల్లో వాగ్వాదాలు, నిరసనలు చోటు చేసుకున్నాయి. అనర్హులను తొలగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీశారు. లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల జాబితా కాకుండా ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుదారుల జాబితాలను గ్రామ సభల్లో అధికారులు ప్రదర్శించారు. పరకాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కమిషనర్ సుష్మ పర్యవేక్షణలో మున్సిపల్ చైర్‌పర్సన్ సోదా అనితారామకృష్ణ, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ పర్యవేక్షణలో హైబోతుపల్లి, మల్లక్‌పేట, అలియాబాద్, లక్ష్మీపురంలో గ్రామ సభలు నిర్వహించారు.
గ్రామ సభల్లో అధికారులను
ప్రశ్నించిన ప్రజలు
లబ్ధిదారుల జాబితాల్లో
పేర్లు లేవని నిలదీత
మరోసారి సంక్షేమ
పథకాలకు దరఖాస్తుల
స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment