నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలి
వరంగల్: మాతా శిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్‌లో డెలివరీలు, వ్యాధి నిరోధక టీకాలు అందిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అన్నారు. మంగళవారం వరంగల్ గిరిప్రసాద్‌నగర్‌లోని బస్తీ దావఖానను సందర్శించి సిబ్బందికి ప్రజలకు అందించాల్సిన వైద్యసేవలు, సమయపాలనపై వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రమిత వ్యాధులు, అసంక్రమిత వ్యాధులు నిర్ధారణ పరీక్షలు చేయించి చికిత్సలు అందించాలన్నారు. మహిళా ఆరోగ్య క్లినిక్, ఆరోగ్యకేంద్రాలు ప్రజల ఆరోగ్య అవసరాల కోసం నిర్మించినట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. వర్ధన్నపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మోహన్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
వర్ధన్నపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించి వైద్యులు, సిబ్బంది ఆదర్శంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అన్నా రు. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్రత్యేక వైరస్, అంటువ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికోసం ఏర్పాటు చేసిన వార్డును పరి శీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. వైద్యులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హె చ్చరించారు. చలికాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి జాగ్రత్తలు పాటించాలని తెలి పారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవా లని మాతా శివు సంరక్షణ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేయాలని, వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలన్నారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసి మెరుగైన చికిత్స అందించాలన్నారు. మహిళ ఆరోగ్య క్లినిక్‌లు, ఆరో గ్య కేంద్రాలు ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చాలన్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తి, వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మోహన్ సింగ్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
Comments
Please login to add a commentAdd a comment