పదకొండేళ్లుగా ఇబ్బందులు..
చెన్నారావుపేట: నాకు వివా హం జరిగి 11 సంవత్సరాలు అవుతుంది. నా భర్త పేరుమీద రేషన్ కార్డు ఉంది. అందులో నా పేరు, నా కూతురు పేరు లేదు. ప లుమార్లు అధికారులకు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదు. ప్రజాపాలనలో కూడా దరఖాస్తు పెట్టుకున్న.. గ్రామసభలో అడుగుదామని వస్తే గొడవ జరగడంతో ఎవరిని అడి గే పరిస్థితి లేకుండా పోయింది. పాప చదువు.. సర్టిఫికెట్ కోసం రేషన్ కార్డులో తప్పనిసరిగా పేరు ఉండాలంటున్నారు. అధికారులు స్పందించి రేషన్ కార్డులో పేర్లు వచ్చే విధంగా చూడాలి.
– కుసుమ సుష్మ, చెన్నారావుపేట
రేషన్‌కార్డు జారీ చేయాలి
నెక్కొండ: నాకు వివాహమై నాలుగేళ్లైంది. ఒక బాబు ఉ న్నాడు. మా కుటుంబానికి రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పా లనలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా.. అలాగే కులగణన సర్వేలో అధికారుల దృష్టికి తీసుకెళ్లా.. కానీ, జాబి తాలో నా పేరు లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనూ నిరాశే ఎదురైంది. నాలుగేళ్లుగా రేషన్ కా ర్డు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. అధికారులు స్పందించి రేషన్ కార్డు జారీ చేయాలి.
– బోనగిరి శివ, చంద్రుగొండ
●
Comments
Please login to add a commentAdd a comment