ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సందర్శన
● సౌకర్యాలపై ఆరా తీసిన కేంద్రబృందం
ఖానాపురం/దుగ్గొండి: ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, దు గ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో పల్లె దవాఖాన, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలను పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ మాని టర్ టీం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హె ల్త్ మిషన్ అధికారులు మంగళవారం సందర్శించా రు. ఈ సందర్భంగా పీఆర్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజ్‌కుమార్, పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ గాంధీ గ్రామ్ తమిళనాడు డాక్టర్ శ్రవణ్‌కుమార్‌లు సెంటర్‌లో పనితీరును తెలుసుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్, మాతా శిశు సంరక్షణ జిల్లా అధికారి పద్మశ్రీ, వైద్యులు అరుణ్‌కుమార్, కిరణ్‌రాజు, రాకేశ్, సిబ్బంది రాంప్రసాద్‌రెడ్డి, రమాదేవి, రమ్య, భాస్కర్, భరత్‌కుమార్, హెచ్‌ఈఓ సాంబయ్య, సలోమి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment