సందేహాలను నివృత్తి చేసిన ప్రత్యేకాధికారి
ధర్మసాగర్: తాటికాయల, ముప్పారం గ్రామ సభల్లో ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి వినయ్‌కృష్ణారెడ్డి పాల్గొని ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ధర్మసాగర్‌లో ఇందిరమ్మ కమిటీ సభ్యుడు రావుల వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు లబ్ధిదారులను సరిగా ఎంపికచేయకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అర్హులు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజలు అధికారులను నిలదీశారు. సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయలేదని మండిపడ్డారు. గ్రామ సభల్లో డీఆర్‌డీఓ మేన శ్రీను, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, మండల స్పెషల్ ఆఫీసర్ డి.మురళీధర్‌రెడ్డి, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఎంపీఓ అఫ్జల్, ఏఓ రాజేశ్, ఏపీఓ సంపత్, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment