‘మల్టీ లెవెల్ మార్కెటింగ్’పై అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ క్రైం: మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పోకడలతో మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలతో పాటు పిరమిడ్ లాంటి స్కీంల ద్వారా ప్రజల నుంచి డబ్బు దోచేస్తున్నారని తెలిపారు. ఈ స్కీంల ప్రధాన లక్ష్యం విలాసవంతమైన వస్తువులు అందజేస్తామని, సొంతింటి కలను నెరవేరుస్తామని, విదేశీ యాత్రలకు పంపిస్తామని చెబుతుంటారని వివరించారు. సైబర్ నేరగాళ్లు మొదటగా కొంత రుసుముతో ప్రాథమిక సభ్యత్వం కల్పిస్తారని తెలిపారు. ఎక్కువ మొత్తం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వస్తుందని, ఎక్కువ మొత్తంలో సభ్యులను చేర్పిస్తే పెద్ద మొత్తంగా డబ్బు వస్తుందని మభ్యపెడుతూ రూ.కోట్లలో డబ్బు కొల్లగొట్ట డం ఈ మల్టీ లెవెల్ స్కీంల ప్రధాన లక్ష్యమని వివరించారు. ఇలాంటి స్కీంల ద్వారా మోసపోయినట్లుగా భావిస్తే తక్షణమే 1930 టోల్ ఫ్రీనంబర్‌కుగానీ, లేదా https://www. cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment