అనర్హులను ఎంపికచేశారని ఆందోళన
నడికూడ: కంఠాత్మకూరు, చౌటుపర్తి, చర్లపల్లి గ్రామాల్లో ప్రజలు అధికారులతో వాగ్వాదం చేశారు. అనర్హుల పేర్లు జాబితాల్లో చేర్చారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాల్లో పేర్లు లేకపోవడంతో చర్లపల్లిలో ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల జాబితాలో భూములు ఉన్న వారే పేర్లు ఉన్నాయని ఆరోపించారు. గ్రామ సభల్లో తహసీల్దార్ నాగరాజు, డీఎల్పీఓ మహ్మద్ షర్ఫుద్దీన్, మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్, ఎంపీఓ చేతన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై శివకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment