ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారని శాయంపేట మండలం తహరాపూర్‌లో జరిగిన గ్రామభలో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడి వెళ్లిన తర్వాత అధికారులు ఈ నెల 26న ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాల అర్హుల జాబితాలోని పేర్లను చదువుతుండగా గుంట భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పి అర్హులకు కాకుండా భూమి ఉన్న అనర్హులకు ఆత్మీయ భరోసా ఇస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు. తహసీల్దార్ సత్యనారాయణ రావు జోక్యం చేసుకుని గొడవ చేయడం సరికాదని, పేర్లు రానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment