వైఎస్సార్ సీపీలో చేరికలు
తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకటమధుసూదనరావు (ఈలినాని) ఆధ్వర్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. పట్టణంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ మారిశెట్టి సుబ్బారావుతోపాటు అతని అనుచరులు సుమారు 100 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. బీజేపీ, జనసేన పార్టీల నుంచి నీలగిరి వరలక్ష్మి, మరో 250 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి మంత్రి కొట్టు పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి కొట్టు మాట్లాడుతూ ఈ నెల 13 జరిగే ఎన్నికల్లో ప్రత్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి వెనుక అందరూ రౌడీలు, గుండాలు, సెటిల్‌మెంట్ బ్యాచ్‌లు, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడేవారే ఉన్నారన్నారు. గూడెం ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు (నాని), అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, కొట్టు తాతాజీ, నిమ్మల నాని, గొర్రెల శ్రీనివాస్, బండారు నాగు, మార్నీడి వెంకన్న, బొడ్డు సాయిబాబా, తాళ్ళ ప్రసాద్, చెన్నా జగనార్దన్, మానికొండ వెంకటేశ్వరరావు, మల్లుల విజయ్, నీలగిరి వరలక్ష్మి, రజని, తిరగం రమాదేవి, ఆరమిల్లి రవి, దాసి బాబు పాల్గొన్నారు.
జనసేన పాలూరు శివ యూత్ చేరిక
తాడేపల్లిగూడెం అర్బన్ : గాంధీబొమ్మ సెంటర్ ప్రాంతానికి చెందిన పాలూరి శివ యూత్ శుక్రవారం ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో పాలూరి శివతోపాటు అతని అనుచరులు, స్నేహితులు సుమారు 100 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిని కొట్టు సత్యనారాయణ పార్టీకండువాలతో ఆహ్వానించారు. రూపేంద్ర, నాగరాజు, సూరజ్, హర్ష, లోవరాజు సాయి, గిద్రోని, అజయ్, పెందుర్తి జీవన్‌కుమార్ పాల్గొన్నారు.
పీవీఎల్ సమక్షంలో..
కాళ్ల: ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నర్సింహరాజు సమక్షంలో ఆకవీడుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైస్సార్ సీపీ నాయకులు కనుమూరి ఆనందవర్మ, కౌన్సిలర్ వంగా జ్యోత్స్న ఆధ్వర్యంలో 50 మంది శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment