ఉద్యోగ భద్రత కల్పించాలి
భీమవరం: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వైద్యారోగ్య శాఖలో విలీనం చేయాలని 104 ఉద్యోగులు ధర్నా చేశారు. ఆదివారం భీమవరం ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో చేపట్టిన ధర్నాను ఉద్దేశించి బి.గోపిమూర్తి మాట్లాడుతూ పోరాటాలు, ఉద్యమాల ద్వా రానే హక్కులు కాపాడుకోవాలని పిలుపునిచ్చా రు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రాయ్ మాట్లాడుతూ పాలకులు కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగేలా 104 వ్య వస్థ నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.విజయకుమార్, ఎస్.సురేష్ మాట్లాడు తూ 104 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం దారుణమన్నారు. వాహనాల మరమ్మతులకు సొమ్ములు చెల్లించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకుడు ఎం.ఆంజనేయులు, యూనియ న్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్, ఉపాధ్యక్షుడు సుందర్‌సింగ్, సత్యనారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రాన్ని ప్రశ్నించలేని కూటమి ప్రభుత్వం
భీమవరం: కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న భారాలను రాష్ట్రంలోని కూటమి సర్కారు కళ్లప్పగించి చూస్తోంది తప్ప ప్రశ్నించడం లేదని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంతెన సీతారామ్ విమర్శించారు. భీమవరంలో ఆదివారం జరిగిన పట్టణ మహాసభలో ఆయ న మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కనీసం స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలపై విద్యుత్ ట్రూఅప్ చార్జీల పేరుతో రూ.20 వేల కోట్ల భారాలు వేస్తున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు జేఎన్‌వీ గోపాలన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 15న కలెక్టరేట్ట్ వద్ద ధర్నా నిర్వహించనున్నామన్నారు. అనంతరం కార్యదర్శి గా డి.వాసుదేవరావు, 9 మందితో నూతన ప ట్టణ కమిటీ ఏర్పడింది. బొక్కా సత్యనారాయ ణ, ఎం.వైకుంఠరావు, బి.వరలక్ష్మి పాల్గొన్నారు.
భీమవరంలో కొనసాగిన ఐటీ సోదాలు
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరంలో ఐటీ శాఖ అధికారుల సోదాలు ఐదో రోజైన ఆదివా రం కూడా కొనసాగాయి. పలువురు రియల్ ఎస్టేట్, రొయ్యల వ్యాపారుల ఇళ్లలో, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంలో సోదాలు లేనప్పటికీ ఐటీ అధికారుల సెక్యూరిటీ సిబ్బంది పహారా కాస్తున్నారు. సాయంత్రం వరకూ వారు అక్కడే ఉన్నారు. రియల్ ఎస్టేట్, రొయ్యల వ్యాపారులే లక్ష్యంగా మూడు రోజుల నుంచి విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. అయితే సోదా ల వివరాలు అధికారులు వెల్లడించలేదు, ఎవ రినీ అదుపులోకి తీసుకోలేదు.
అంతర్ వర్సిటీ జూడో పోటీలు
పెంటపాడు :పెంటపాడు డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నన్నయ్య వర్సిటీ అంతర్ కళాశాలల జూడో పోటీలు ప్రారంభమయ్యాయి. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 14 మంది పురుషులు, మహిళలను ఎంపిక చేశారు. న్యాయ నిర్ణేతగా టీవీ రమణతేజ, అబ్జర్వర్‌గా రాంగోపాల్ వ్యవహరించారు. పీడీ బుజ్జిబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.
వీరేశ్వరా పాహిమాం
పోలవరం రూరల్: పట్టిసం శివక్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం లక్షపత్రి పూ జను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, లక్షపత్రి పూజ, భద్రకాళీ అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆంధ్ర రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎం.రవికిరణ్ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment