అవకాశవాదంపై అవిశ్వాసం
సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీకి చెక్ పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు దూకుడు పెంచగా.. టీడీపీ పంచన చేరినా అండ లేక ఆమె తీవ్ర నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యేలు సైతం తామున్నామంటూ భరోసా ఇవ్వకపోగా పక్కలో బల్లెంలా మారడంతో తీవ్ర సంకట స్థితికి చేరుకున్నారు. కనీసం సహచర జెడ్పీటీసీలు సైతం కలిసి రాకపోవడంతో ఏకాకిగా మారారు. జనసేనలోకి జంప్ అంటూ ఉప్పందించి తీరా టీడీపీలోకి చేరడంతో ఆ పార్టీ నేతలు సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అండ కోల్పోయిన తరుణంలో కొత్త పార్టీలోనైనా భరోసా దొరుకుతుందని ఆశించినా ప్రయోజనం శూన్యంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో తన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో పదవి కాపాడుకోవడం ఆమెకు తక్షణ కర్తవ్యంగా మారింది. పదవి ఉంటుందా.. ఊడుతుందా అనేది తెలియని సందిగ్ధం ఒకవైపు, రాజకీయంగా ఎదగాలనే ఆకాంక్ష నెరవేరుతుందా లేదా అనేది మరోవైపు ప్రశ్నార్థకంగా మారాయి.
తారాస్థాయిలో అసమ్మతి
జెడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీకి అసమ్మతి సెగ తారాస్థాయిలో తగిలింది. ఈనెల 8న జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు బహిష్కరించి తమ అజెండాను ప్రకటించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమైపె అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు జెడ్పీ సీఈఓకు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో సోమవరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ సర్వసభ్య అత్యవసర సమావేశం ఏర్పాటు కానున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హత వేటు వేయించేందుకు గట్టిగా పట్టుబడుతున్నారు.
పార్టీ విప్‌ను ధిక్కరించి..
వాస్తవానికి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కవురు శ్రీనివాస్ గతేడాది వరకు కొనసాగారు. ఎమ్మెల్సీగా కవురు శ్రీనివాస్‌ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేయడంతో జెడ్పీ చైర్‌పర్సన్ స్థానం ఖాళీ అయింది. బీసీ సామాజిక వర్గంలోని కొప్పుల వెలమకు చెందిన పెదపాడు జెడ్పీటీసీ ఘంటా పద్మశ్రీని పార్టీ ఆ పదవికి ఎంపిక చేసింది. పద్మశ్రీ భర్త ఘంటా ప్రసాద్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ విప్‌ను అనుసరించి 44 మంది జెడ్పీటీసీలు ఘంటా పద్మశ్రీని జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె పార్టీ విప్‌ను ధిక్కరించి పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్ 181 (1) ప్రొవిజన్‌ను అనుసరించి ఆమెను డిస్ క్వాలిఫై చేయాలని, అలాగే సెక్షన్ 181 (7) ప్రకారం తిరిగి జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక జరిపించాలని నోటీసులు ఇచ్చారు.
టీడీపీలోనూ ఎదురీతే..
వైఎస్సార్‌సీపీ పదవులకు రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్టు జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా ప ద్మశ్రీ ప్రకటించగా.. ఆ తర్వాత మూడు రోజులకే ఆ మె భర్త ఘంటా ప్రసాద్ హడావుడిగా విశాఖ వెళ్లి మరీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన టీడీపీలో చేరారు. మళ్లీ కొద్ది రోజులకు చైర్‌పర్సన్ దంపతులు లోకేష్ సమక్షంలో పార్టీలో చేరి.. అనంతరం చంద్రబాబును కలిశారు. పెదపా డు జెడ్పీటీసీ కావడంతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో మొదటి నుంచి వీరికి వి భేదాలున్నాయి. దీంతో చింతమనేని వర్గం సోషల్ మీడియా వేదికగా జెడ్పీ చైర్‌పర్సన్ చేరికపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండా పార్టీలో చేర్చుకోవడం సరైన పద్ధతి కాదని, పార్టీలో చేరినంత మాత్రాన గతాన్ని ఏమీ మరిచిపోబోమని బహిరంగంగా చింతమనేని అనుచరులు హెచ్చరిస్తున్నారు. ఇక లోకేష్ సమక్షంలో చేరే సమయంలో కూడా మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా అధ్యక్షుడు మినహా ఒక్క ప్రజాప్రతినిధి కూడా కలిసిరాలేదు. ఘంటా పద్మశ్రీ టీడీపీలో చేరినా అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారే తప్ప పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం గమనార్హం.
నయవంచనకు గుణపాఠం
నేడు జెడ్పీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం
44 మంది జెడ్పీటీసీలు వైఎస్సార్‌సీపీలోనే..
ఇప్పటికే స్టాండింగ్ కమిటీల బహిష్కరణ
అనర్హత వేటు వేయాలంటూ నోటీసు ఇచ్చిన వైనం
టీడీపీ తీర్థం పుచ్చుకున్న జెడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీ
ఆమె చేరికను వ్యతిరేకిస్తున్న చింతమనేని వర్గం
పద్మశ్రీకి సర్వత్రా అసమ్మతి సెగ
Comments
Please login to add a commentAdd a comment