స్పందన
కాలినడక మార్గం శుభ్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో క్షీణించిన పారిశుద్ధ్యంపై సోమవారం ‘సాక్షి’లో ‘శ్రీవారి క్షేత్రంలో పారిశుద్ధ్య లేమి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆలయ ఈఈ డీవీ భాస్కర్ భక్తులు పాదయాత్రగా క్షేత్రానికి వచ్చే (కొండపైన పాత టోల్‌గేట్) మార్గం వద్ద పేరుకుపోయిన చెత్తను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై మండిపడ్డారు. వెంటనే పొక్లయిన్‌తో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. వెంటనే ఆ ప్రాంతంలోని పొదలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య లోపానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
29న సీజీఆర్‌ఎఫ్ సదస్సు
సాక్షి, విశాఖపట్నం: జంగారెడ్డిగూడెం డివిజన్‌లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 29న సదస్సు నిర్వహించనున్నట్టు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) చైర్‌పర్సన్, విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణ తెలిపారు. డివిజన్ పరిధిలోని కొయ్యలగూడెంలో సదస్సు నిర్వహిస్తామని, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment