భక్తులకు వన్‌వే కష్టాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆల య అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఆదివా రం భక్తులు ఇబ్బంది పడ్డారు. కొండ కిందకు వెళ్లే మార్గాన్ని మూసివేసి శివాలయం ఘాట్ రోడ్డు మీదుగా వెళ్లాలని అనడంతో అవస్థలు పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. క్షేత్రానికి వాహనాలపై వచ్చే భక్తులు ప్రధాన టోల్‌గేట్ మీదుగా కొండపైకి చేరుకుంటారు. వాహనాలను సెంట్రల్ పార్కింగ్ లో నిలుపుతారు. మొక్కులు చెల్లించే వారిలో వృద్ధులు, దివ్యాంగులు ఉంటే సెంట్రల్ పార్కింగ్ వద్ద యూటర్న్ తీసుకుని, కిందకు వచ్చి టోల్‌గేట్ సమీ పంలోని కేశఖండనశాల వద్ద దింపుతారు. అయితే అధికారుల ఆదేశాలతో కొండ కిందకు (కేశఖండన శాలకు) వచ్చే మార్గాన్ని సిబ్బంది పూర్తిగా మూసివేశారు. కొండపై నుంచి వాహనాలు శివాలయం (దొరసానిపాడు) ఘాట్‌రోడ్డు మీదుగానే వెళ్లాలని సూచించారు. అయితే హఠాత్తుగా తీసుకువచ్చిన వన్‌వే నిబంధనలు తెలియని పలువురు భక్తులు కొండపై నుంచి తిరిగి శివాలయం ఘాట్ రోడ్డు మీదుగా ఊరు మొత్తం చుట్టి మొక్కుల కోసం కేశఖండనశాల వద్దకు చేరుకున్నారు. రెండోసారి వెళ్లిన వాహనదారుల నుంచి టోల్ రుసుములను మళ్లీ వసూలు చేశారు. దీనిపై భక్తులు ఆందోళన వ్య క్తం చేయడంతో అధికారులు వెనుకడుగు వేశారు. సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలకు గతంలో మాదిరిగా అనుమతిచ్చారు. ఇదిలా ఉండగా కొండపైన గేటు పెట్టి (కాలినడక భక్తులకు దారి వదిలి) మూసివేసిన పాత టోల్‌గేట్ మార్గాన్ని శని, ఆదివారాలు, పర్వదినాల్లో తెరిచి రాకపోకలకు అనుమతించాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment