పురపాలక.. పట్టని ఏలిక
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు పట్టణాల్లో అభివృద్ధి పనులు శూన్యంగా మారాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు కావస్తున్నా జిల్లాలోని మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క రోడ్డు లేదా డ్రె యినేజీ నిర్మాణ పనులు కూడా జరగలేదు. నిధులు ఉన్నా అభివృద్ధి పనులకు మున్సిపాలిటీలు నోచుకోవడం లేదు. రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా మా రడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటోంది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై కూటమి ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల సమయంలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం, తాగునీటి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తమను విస్మరించారని ప్రజలు అంటున్నారు. అభివృద్ధి పనులకు ఇసుక కొరతను సాకుగా చూపుతున్నారు. పక్క జిల్లాల్లో ఇసుక అందుబాటులో ఉందని స్వయానా కలెక్టర్ చెబుతున్నా పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు సైతం స్పందించడం లేదు. వారు కూడా ఎమ్మెల్యేలు అదేశిస్తే గాని పనులు చేపట్టే పరిస్థితి లేదు.
జగన్ హయాంలో తొలి మూడు నెలల్లోరూ.10 కోట్లతో పనులు
2019లో జగన్ సర్కారు కొలువు దీరిన మొదటి మూడు నెలల్లోనే జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో రూ.10 కోట్ల మేర అభివృద్ధి పనులు చేయించారు. వర్షాకాలంలోనూ పక్కా ప్రణాళికతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. ఒక్కో పట్టణంలో రూ.కోటి నుంచి రూ.1.50 కోట్ల పనులు జరిగాయి. అంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం తీర్మానం చేసిన పనులను సైతం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పూర్తిచేయించారు. అలాగే గత ఐదేళ్లలో ఆరు పట్టణాల్లో రూ.430 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంతో పాటు భవనాల మరమ్మతులు, ఇతర పనులు చేయించారు.
గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు
పట్టణం వ్యయం
(రూ.కోట్లలో)
భీమవరం 130
తాడేపల్లిగూడెం 70
నరసాపురం 50
పాలకొల్లు 60
తణుకు 70
ఆకివీడు 50
పట్టణాల్లో ప్రగతి శూన్యం
రోడ్లు, డ్రెయినేజీ పనులు లేవు
పట్టించుకోని ఎమ్మెల్యేలు
గత ప్రభుత్వంలో రూ.430 కోట్ల మేర పనులు
Comments
Please login to add a commentAdd a comment