గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
నరసాపురం: గాంధీజీ ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. బుధవారం గాంధీ జయంతి వేడుకను వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి ముదునూరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పాలన చేరువ చేశారన్నారు. మహాత్ముడు చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా గత ప్రభుత్వం కృషి చేసిందన్నారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు, మునిసిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, వైస్ చైర్పర్సన్ కామన నాగిని, ఎంపీపీ మైలాబత్తుల సోనీ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి
Comments
Please login to add a commentAdd a comment