నాణ్యమైన ఆహారం అందించాలి
తణుకు టౌన్: విద్యార్థులకు అందించే మంచినీరు, ఆహార పదార్థాలు నాణ్యమైనవి ఉండాలని తణుకు మండల న్యాయ సేవా సంస్థల చైర్మన్, తణుకు నాల్గో జిల్లా అదనపు జడ్జి డి సత్యవతి ఆదేశించారు. బుధవారం ఆమె తణుకులోని బాల సదన్ చిల్డ్రన్ హోం, గుడ్ సమరిటన్ చిల్డ్రన్ హోం, ప్రభుత్వ బాలుర వసతి గృహం, పాలంగిలోని ప్రేమాన్విత మానసిక వికలాంగుల పాఠశాలలను తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాల భవనాలకు సంబంధించిన వంట గది, మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, స్నానాల గదులను పరిశీలించారు. మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పీఎన్వీ రంజిత్‌కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment