నరసాపురం డీఎస్పీగా శ్రీవేద
నరసాపురం: నరసాపురం డీఎస్పీగా డాక్టర్ డి.శ్రీవేద సోమ వారం బాధ్యతలు చేపట్టారు. 2022 బ్యాచ్‌కు చెందిన ఆమె అనంతపురం పోలీసు శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్‌లో ఇక్కడ నియమితులయ్యారు. శ్రీకాకుళంకు చెందిన ఆమె తండ్రి సూర్యప్రకాశరావు ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. గతంలో ఏలూరు రేంజ్ డీఐజీగా కూడా పనిచేశారు. శ్రీవేద డెంటల్ సర్జన్‌గా వైద్య వృత్తిని కొనసాగించి గ్రూప్స్ ద్వారా పోలీసు శాఖకు ఎంపికయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మా ట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్య నివారణ, అసాంఘిక కార్యక్రమాల అదుపునకు ప్రాధాన్యమిస్తామన్నారు. డివిజన్‌లోని సీఐలు, ఎస్సైలు ఆమెను కలిసి అభినందించారు.
ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారు?
భీమవరం అర్బన్: ఎన్నికల సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలపై చంద్రబాబు ఇచ్చిన హా మీని వెంటనే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. మండలంలోని గూట్లపాడులో సోమవారం ఇళ్ల స్థలాలపై ధర్నా చేశారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని, తక్కువ ధరకే ఐరన్, సిమెంట్, ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కారు అధికారం చేపట్టి ఐదు నెలలు కావస్తున్నా నివేశన స్థలాలు, గృహ నిర్మాణంపై కార్యాచరణ చేపట్టకపోవడం దారుణమన్నారు. హామీ అమలు చేయకుంటే ఉద్యమానికీ వెనుకాడబోమని హె చ్చరించారు. రూరల్ మండల కార్యదర్శి ఎం. సీతారాంప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, జిల్లా సమితి సభ్యులు తిరుమాని కామేశ్వరరావు, తిరుమాని కామేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మద్యం దుకాణంతో మూడు గ్రామాలకు ఇబ్బందులు
కై కలూరు: మద్యం దుకాణం ఏర్పాటుతో మూ డు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతారంటూ సోమవారం వదర్లపాడు గ్రామంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వదర్లపాడు శ్మశాన వాటిక సమీపంలో రైస్‌మిల్లు వద్ద మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండగా సర్పంచ్ వడుపు లక్ష్మీ నాగదేవి ఆధ్వర్యంలో ని రసన తెలిపారు. వదర్లపాడు, నరసాయిపాలెం, శీతనపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతారని, ఇటుగా విద్యార్థులు పాఠశాలలకు వెళతారన్నారు. సమీపంలో ఆలయాలు కూడా ఉన్నాయన్నారు. విషయం తెలిసిన కై కలూరు ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ ఎస్‌కే రమేష్, ఎస్సై ఆదినారాయణ ఇక్కడకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పడంతో నిరసన విరమించారు.
16 ఫిర్యాదుల స్వీకరణ
భీమవరం: ప్రజా ఫిర్యాదులు పరిష్కారానికి తొలి ప్రాధాన్యమివ్వాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కా ర్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో 16 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. కుటుంబ కలహాలు, అత్తంటి వేధింపులు, ఆస్తి, భూతగాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలపై ఫిర్యాదులు అందాయి. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment