గడువులోపు పరిష్కారం చూపాలి
కలెక్టర్ నాగరాణి
భీమవరం (ప్రకాశం చౌక్) : మీకోసంలో వచ్చిన ఫిర్యాదులకు పూర్తిస్థాయిలో గడువులోపు పరిష్కా రం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే అర్జీలు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. అనంతరం ఆమె జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డితో కలిసి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాల జారీ చేశారు.
అర్జీల్లో కొన్ని..
● ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సమయంలో రైతు సేవా కేంద్రాల్లో నిర్ధారించిన తేమ, నూకశాతాన్ని మిల్లర్లు పరిగణలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.
● భీమవరంలోని గరగపర్రు రోడ్డు బైపాస్ నాలుగు రోడ్ల కూడలి వద్ద మద్యం షాపు ఏర్పాటుతో ఇబ్బంది పడుతున్నామని, దానిని తొలగించా లని స్థానికులు ఎం.సత్యకుమారి, ఆర్.మంగతాయారు వినతిపత్రం సమర్పించారు.
● అత్తిలి మండలం తిరుపతిపురంలో 45 ఎకరాలకు సాగునీరు అందించే బోదే ఆక్రమణకు గురైందని నాగకరుణ కుమారి అనే మహిళ ఫిర్యాదు చేశారు.
● జిల్లాలోని పలువురు దివ్యాంగులు తమకు సామాజిక పింఛన్ మొత్తాన్ని పెంచాలని, ఉపాధికి పంచాయతీ షాపులను అద్దెకు ఇప్పించాలని అభ్యర్థించారు.
జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment