నిందితులకు రాజకీయ అండ
చాట్రాయి : మండలంలోని పోతనపల్లికి చెందిన వై ఎస్సార్ సీపీ కార్యకర్త కాణంగుల చందూపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపర్చి మూడు రోజులు గడిచినా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిందితులకు రాజకీయ అండదండలు ఉండటంతో పోలీసులు చర్య లు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నా రు. ఈనెల 15న మంకొల్లుకి చెందిన టీడీపీ కార్య కర్తలు బి.మధు, మరో నలుగురు కలిసి చందూపై రాడ్లతో దాడి చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి వాంగ్మూలం తీసుకుని 108లో చింతలపూడి ఆస్పత్రికి తరలించారు. అక్క డి నుంచి మెరుగైన వైద్యం కోసం చందూను ఏలూ రు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం బాధితుడు ఏలూరులో చికిత్స పొందుతున్నాడు. నిందితులు గ్రామంలో తిరుగుతున్నా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీని పై ఎస్సై రామకృష్ణను వివరణ కోరగా కేసు న మోదు చేశామని, ఆస్పత్రి నుంచి బాధితుడి మెడికల్ రిపోర్ట్ రాలేదని వచ్చిన తర్వాత నిందితులను రిమాండ్‌కు పంపిస్తామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ శ్రేణుల దాడి
పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు
Comments
Please login to add a commentAdd a comment