అట్టహాసంగా ప్రభోత్సవం
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్న భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి రథోత్సవం సోమవారం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో శివయ్యకు విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాత్రి అశ్వ వాహన రథంలో గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి దంపతులు రథం వద్ద కొబ్బరికాయలు కొట్టి బలిహరణ సమర్పించారు. అనంతరం రథోత్సవం ప్రా రంభమైంది. స్వామివారు క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా అశ్వరథంపై ఊరేగారు. రథం వెనుక ప్రభ వాహనం భక్తులకు కనువిందు చేసింది. శివయ్య, అఘోరాల వేషధారణలతో కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment