108ఉద్యోగుల ఆక్రందన
భీమవరం(ప్రకాశం చౌక్): తమ సమస్యలు పరిష్కరించాలంటూ 108 సర్వీసుల ఉద్యోగులు భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవారం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 108 ఉద్యోగులు కొద్దిరోజు లు నిరసనలు తెలుపుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకుంటే ఈనెల 25వ తేదీ తర్వాత సమ్మెకు వెళతామని ప్రకటించారు. సమ్మె కారణంగా ప్రజలకు జరిగే అసౌకర్యానికి పూర్తి బాధ్యత యాజమాన్యం, ప్రభుత్వం వహించాల్సి ఉంటుందన్నారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరు గా ప్రభుత్వమే నిర్వహించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రోజుకు మూడు ఫిఫ్టులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ మార్కు లు ఇవ్వాలని, మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని, 108 వాహ నాలకు శాశ్వత భవనాలు ఏర్పాటుచేయాలని కో రారు. వేతన బకాయిలను పూర్తిగా చెల్లించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment