ఆశావర్కర్ల నిరసన గళం
భీమవరం(ప్రకాశం చౌక్): కనీస వేతనం, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, గ్రూపు బీమా, నాణ్యమైన ఫోన్స్, యూ నిఫాం, సెలవులు తదితర డిమాండ్లపై ఆశావర్కర్లు భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవార భారీ ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ మహేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ గత ఫిబ్రవరిలో తమ సమస్యలపై అధికారులు చర్చించి రాతపూర్వకమైన హామీ ఇచ్చారని, అయితే వాటిని అమలు చేయడం లేదన్నారు. తమపై పని ఒత్తిడి, రాజకీయ వేధింపులు పెరుగుతున్నాయని, కొన్ని చోట్ల పీహెచ్‌సీ వైద్యులు, ఏఎన్‌ఎంలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ లో జిల్లా వైద్యశాఖాధికారుల సమక్షంలో జరిగిన స మావేశంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలులోనూ తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. వీహెచ్‌ఎస్‌ఎన్‌సీ కమిటీల ద్వారా ఆశావర్కర్ల తొలగింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ లక్ష్మి, జిల్లా సెక్రటరీ డి.జ్యోతి తదితరులు నాయకత్వం వహించారు. జిల్లావ్యాప్తంగా ఆశావర్కర్లు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment