రక్తనిధి కేంద్రం ప్రారంభం
భీమవరం అర్భన్: రక్తనిధి కేంద్రాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మండలంలోని రాయలం గ్రామంలో సోమవారం నూతన రక్తనిధి కేంద్రాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డితో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ నిధులు రూ.2.50 కోట్లతో ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటుచేశారన్నారు. దీంతో జిల్లాలో మొత్తం మూడు బ్లడ్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ 59 రక్తనిధి కేంద్రాలు ఏ ర్పాటుచేయగా రాష్ట్రంలో 18 ఉన్నాయన్నారు. త్వరలో రూ.60 లక్షల విలువైన మొబైల్ బ్లడ్ డోనార్ వాహనాన్ని జిల్లాకు సమకూరుస్తామనఆనరు. భీమవరం శాఖ చైర్మన్ ఎంఎస్‌వీఎస్ బద్రిరాజు, కోళ్ల నాగేశ్వరరావు, సోమరాజు, చె రుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment