విద్యార్థినిని చితక్కొట్టిన కరస్పాండెంట్
ఆకివీడు: విద్యార్థినిని స్కూల్ కరస్పాండెంట్ చితక్కొట్టిన వైనం శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఆకివీడు నగర పంచాయతీ కార్యాలయం వెనుక భాగాన ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థ కరస్పాండెంట్ తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని చెంపలు వాయించి, పీక నులిమేసి భయభ్రాంతులకు గురిచేశారు. వివరాలిలా ఉన్నాయి.. విద్యార్థిని స్కూలు ముగిసిన వెంటనే ఇంటికి వెళ్లే క్రమంలో బ స్సు డ్రైవర్ అన్న మాటలను వంత పాడిన విషయా న్ని డ్రైవర్ వచ్చి కరస్పాండెంట్కు చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన కరస్పాండెంట్ కేఎన్వీ సత్యనారాయణ.. విద్యార్థిని చెంపలు వాచిపోయేలా కొ ట్టారు. అంతేగాకుండా ‘నన్ను కోళ్ల డాక్టర్’ అంటా వా అంటూ ఆమె పీక పట్టుకుని తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు. ఇదంతా సహచర విద్యార్థుల మధ్యే జరిగింది. అనంతరం విద్యార్థిని మౌనంగా ఇంటికి వెళ్లిపోయింది. విద్యార్థిని తాత నరసింహారావు స్వ గ్రామం నందమిల్లిపాడు గ్రామంలో వారి ఇంటి వ ద్ద పెరుగుతూ చదువుకుంటోంది. చెంపలు వాయడంపై నరసింహారావు ఆరా తీయగా విద్యార్థిని జరిగిన విషయాన్ని చెప్పింది. విద్యార్థిని బంధువులు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఆమెను ఆకివీడు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న విద్యార్థిని వద్దకు స్కూలు సిబ్బంది వచ్చి రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై స్థానిక పోలీస్స్టేషన్లో నరసింహారావు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment