పశువుల్లో ఏఎంఆర్‌పై అవగాహన
పెంటపాడు: పశువుల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)పై పశువైద్య సిబ్బంది పూర్తి అవగాహన పెంచుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పి.మురళీకృష్ణ అన్నారు. పశువుల్లో వ్యాధి క్షీణత వల్ల ఏర్పడే లోపాలను వైద్యులకు వివరించే ప్రక్రియలో భాగంగా శనివారం పెంటపాడులో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిపుణులైన వైద్యులు పశు వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. మితిమీరిన విచక్షణారహిత మందుల వినియోగంతో ప్రజలతో పాటు పశువులకు నిరోధక శక్తి తగ్గుతుందన్నారు. వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. పశువుల్లో ఏఎంఆర్ ప్రభావం, దాని వ్యాప్తిని అరికట్టే విధానంపై మా ట్లాడారు. గన్నవరం వెటర్నరీ కళాశాల మైక్రో విభాగాధిపతి ఆనంద్‌కుమార్, వీఆర్ గూడెం బఫెల్లో రీసెర్చ్ సెంటర్ ప్రొఫెసర్ ఆనందరావు, జిల్లా ఇమ్యూనేజేషన్ అధికారి డాక్టర్ సుధ, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం డిప్యూటీ డైరెక్టర్లతో పాటు సహాయ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment