బాల్య వివాహాలతో అనర్థం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలతో అనర్థం

Published Thu, Nov 28 2024 12:56 AM | Last Updated on Thu, Nov 28 2024 12:56 AM

-

భీమవరం(ప్రకాశం చౌక్‌) బాల్య వివాహాలతో అనర్ధాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘బాల్‌ వివాహ ముక్త్‌ భారత్‌’ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని న్యూఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌ నుంచి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సంబంధిత శాఖ అధికారులతో కలిసి పాల్గొన్ని తిలకించారు. బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే అమలు చేసే చట్టాలపై రూపొందించిన సమాచార గోడ ప్రతిని ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాతరాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్‌.రాజేష్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ డి.మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement