ఇంటర్‌లో చేరేలా ప్రోత్సహించాలి
భీమవరం: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో అధ్యాపకులు మంచి విద్యను అందించి విద్యార్దులను ప్రయోజకులను చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఇంటర్మీడియట్ ఫలితాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను నిర్దేశించే ఇంటర్మీడియట్ విద్యను అత్యంత నాణ్యతగా అందించాలన్నారు. టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించి ఇంటర్‌లో చేరికలను పెంచేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్వాలిఫైడ్ అధ్యాపకులు, నాణ్యమైన విద్య, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం వంటివి ఉంటాయనే విషయం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టరు చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆమె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, భవన నిర్మాణాలు, సదరన్ సర్టిఫికెట్ల జారీ, ఎఫ్‌ఆర్‌ఎస్ హజరు తదితర 12 అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. లక్ష్యాలు లోటు ఉన్న మండలాలకు సంబంధించి వైద్యాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్నేహ పూర్వకమైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యాధికారులు, స్పెషలిస్టులు ప్రభుత్వ ఆస్పత్రిలో రెండవ పూట ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని పనితీరు మార్చుకోవాలన్నారు.
మెగా పేరెంట్–టీచర్ సమావేశంపై సమీక్ష
మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. డీఈవో, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలతో మెగా పేరెంట్ – టీచర్ సమావేశాలపై దిశానిర్ధేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment