కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
సాక్షి, యాదాద్రి : మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా విరివిగా రుణాలు అందజేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను గురువారం కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలు మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో ఐదు మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదించిందని, కలెక్టరేట్‌లో ప్రారంభించిన క్యాంటీన్ వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. జిల్లాకు సీ్త్రశక్తి భవన్ మంజూరైందని, నిర్మాణానికి స్థలం కూడా కేటాయించినట్లు తెలిపారు.
ఆర్థికాభివృద్ధి సాధించాలి : కలెక్టర్
మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు మంజూరు చేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. సంఘాల కోసం మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, డీపీఎంలు, ఏపీఎంలు, మహిళా శక్తి సంఘం అధ్యక్షురాలు రేణుక, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
ఫ కలెక్టరేట్‌లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment